Skip to main content

Namaste NRI

బ్రిటన్ రాజవంశం కీలక నిర్ణయం

బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగించకూడదని నిర్ణయించింది. వలస రాజ్యాల పాలనకు గుర్తుగా బ్రిటన్ రాచకుటుంబం చేతిలో ఉన్న వివాదాస్పద కోహినూర్ వజ్రం లేని కిరీటంతోనే తన భర్త, కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనాలని బ్రిటన్ రాణి కెమిల్లా నిర్ణయించారు. ఈ విషయాన్ని బకింగ్‌హాం ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. క్వీన్ కాన్సార్ట్ అయిన కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని వినియోగించాలని తొలుత భావించినా, చివరకు ఆ ఆలోచనను పక్కన పెట్టారు. ఈ కిరీటానికి బదులు క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు. ఇప్పటికే కెమిల్లాకు అనుకూలంగా ఉండేందుకు ఈ కిరీటం పరిమాణంలో మార్పులు చేస్తున్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు చెందిన నగలను ఈ కిరీటంలో పొదగనున్నారు. ఈ ఏడాది మే 6న బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేకం జరుగుతుంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆదే సమయంలో క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

Social Share Spread Message

Latest News