Skip to main content

Namaste NRI

బ్రిటన్‌ షాక్‌… నేటి నుంచి అమల్లోకి

బ్రిటన్‌లో విద్యనభ్యసించాలనుకొనే విద్యార్థులకు చేదువార్త. బ్రిటన్‌ ప్రభుత్వం విద్యార్థి వీసాల ఫీజులను భారీగా పెంచింది. ఆరునెలల లోపు గడువుతో ఆ దేశంలో పర్యటించాలనుకొనేవారి వీసాల చార్జీలను కూడా పెంచింది. ముఖ్యంగా విద్యార్థి వీసాల చార్జీలను 490 గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్లు (జీబీపీ) పెంచింది.  పర్యాటక వీసాలపై 115 జీబీపీలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు నేటి నుంచే అమల్లోకి రానున్నది. వీసా ఫీజుల పెంపును బ్రిటన్‌ హోంశాఖ సమర్థించుకొన్నది. దేశంలో ప్రజా పనులకు అధిక నిధులు కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించింది. విదేశీయుల వీసా ఫీజులతోపాటు జాతీయ ఆరోగ్యసేవకు (నేషనల్ హెల్త్ సర్వీస్) వారు చెల్లించే సర్‌ఛార్జీని పెంచారు. దేశంలోప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు వేతనాల పెంపు కారణంగా పడే భారాన్ని దీని ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. 

Social Share Spread Message

Latest News