Skip to main content

Namaste NRI

భారతీయ విద్యార్థులకు చైనా తీపి కబురు

భారతీయ విద్యార్థులకు చైనా తీపి కబురు చెప్పింది. బీజింగ్‌లో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మీడియాతో మాట్లాడుతూ  చైనాలో విద్యనభ్యసిస్తూ కోవిడ్‌ కారణంగా స్వదేశంలో ఆగిపోయిన భారతీయ విద్యార్థులను  వీలైనంత త్వరగా  చైనాకు తిరిగి రప్పించేందుకు కృషి చేస్తున్నాం.  ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైందన్నారు. త్వరలోనే భారత్‌ నుంచి విద్యార్థుల తొలి బ్యాచ్‌ ఆగమనం మీరు చూస్తారు అని  అన్నారు.  విదేశీ విద్యార్థుల కోసం ప్రభుత్వం నూతన వీసా విధానాన్ని తెస్తోందన్న వార్తల నేపథ్యంలో వాంగ్‌ సృష్టత నిచ్చారు.  చైనాలో దాదాపు 23వేలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం వైద్య విద్యార్థులే ఉన్నారని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events