Skip to main content

Namaste NRI

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉదృతి పెరుగుతున్నందున యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, తక్షణమే పర్యవేక్షించాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే నిర్మల్‌ పట్టణం నీటమునిగిందని అక్కడికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను కేసీఆర్‌ ఆదేశించారు.

Social Share Spread Message

Latest News