Namaste NRI

ప్రగతిభవన్‌లో వినాయకుడికి సీఎం కేసీఆర్ పూజలు

వినాయక చవితి వేడుకలను ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రగతి భవన్‌ ప్రాంగణంలో భారీ మట్టి వినాయకుడిని ప్రతిష్టించి ముఖ్యమంత్రి కేసీఆర్‌, శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్ణేశుడిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వేడుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News