Namaste NRI

ఆ దేశంలో ఆందోళనలు.. భారతీయులకు కేంద్రం సూచనలు

బంగ్లాదేశ్‌లో ప్రత్యేక రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా 1971 స్వాతంత్ర్య యుద్ధంలో పాల్గొన్న వారి వారసులతో సహా కొన్ని వర్గాలకు సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించడంపై ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రాజధాని ఢాకాతోపాటు ఇతర నగరాల్లో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో టియర్‌ గ్యాస్ షెల్స్‌ ప్రయోగించి ఆందోళనకారుల ను చెదరగోట్టారు.

బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది. బంగ్లాదేశ్‌లోని భారతీయ నివాసితులు ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. బయటకు వెళ్లవద్దని, కదలికలను తగ్గించాలని ఢాకాలోని భారత హైకమిషన్ కోరింది. మరోవైపు బంగ్లాదేశ్‌లోని భారతీయ నివాసితులకు ఏదైనా అత్యవసరం లేదా సహాయం అవసరమైతే 24 గంటల ఎమర్జె న్సీ నంబర్‌లలో హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్‌లను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events