ఆది సాయికుమార్ హీరోగా ఫణి కృష్ణ సిరికి తెరకెక్కిస్తున్న చిత్రం క్రేజీ ఫెలో. దిగంగన సూర్యవంశి, మిర్నా మేనన్ కథానాయికలు. ఓ మంచి కథతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో ప్రచార కార్యక్రమాల్ని మొదలు పెడతాం అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు విడుదలైన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సంగీతం: ఆర్.ఆర్. ధ్రువన్, ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల. ఎడిటింగ్ : సత్య గిడుటూరి.




























