
అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం రాకా. దీపిక పదుకోన్ కథానాయిక. ఇటీవలే దీపికా పదుకోన్‌పై కీలకమైన యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు అట్లీ చిత్రీకరించారట. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న దీపిక, ప్రెగ్నెనీతోనే కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారని సమాచారం. అంతేకాదు, తన ఎనిమిది గంటల పని నిబంధనను కూడా ఈ సినిమా విషయంలో ఆమె పక్కన పెట్టారని తెలిసింది. మెటర్నిటీ బ్రేక్ తీసుకునే ముందు, రాకాలో తన పార్ట్ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని ఆమె నిర్ణయించారట. అటు షూట్‌లో పాల్గొంటూనే ఇటు తన మొదటి కూతురు దువాను కూడా చూసుకుంటూ, లొకేషన్‌లో నటిగా, తల్లిగా రెండు బాధ్యతలనూ నిర్వర్తిస్తూ అందరి దృష్టినీ దీపిక ఆకర్షించారట.





























