చాల్ఫాంట్ (పెన్సిల్వేనియా):డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం (TAGDV) ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది సాంస్కృతిక పోటీలు–2026 ఘనవిజయం సాధించాయి. భారతీయ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 200కు పైగా పోటీదారులు పాల్గొనగా, 600 మందికి పైగా ప్రేక్షకులు హాజరై ఉత్సాహంగా వీక్షించారు.పిల్లలు, యువత వివిధ వయో విభాగాల్లో పాటలు, నృత్యాలు, తెలుగు ప్రసంగ పోటీల్లో తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. కార్యక్రమం మొత్తం తెలుగు సంస్కృతి, సంప్రదాయాల సుగంధంతో కళకళలాడింది.


ఈ సందర్భంగా సంఘ కార్యవర్గం మాట్లాడుతూ, “పోటీలకు లభించిన స్పందన, పిల్లలు చూపిన ప్రతిభ ఎంతో ప్రేరణనిచ్చింది. భవిష్యత్ తరాలకు తెలుగు భాషా సంస్కృతిని చేరవేయడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.


పోటీలకు న్యాయనిర్ణేతలుగా శ్రీనివాస్ చాగంటి, డా. అన్నపూర్ణ చాగంటి, డా. మధు దౌలపల్లి, గురు శ్రీమతి మహాలక్ష్మి నారాయణ, శ్రీమతి శివరంజని బతుల, హరికృష్ణ మహర్షి, గురు శ్రీమతి కృష్ణ ప్రియ వోగేటి, గురు శ్రీమతి సంగీత బాలచందర్, గురు శ్రీమతి శ్రావణి నాగబండి, గురు శ్రీమతి భారతి అశోక్, శ్రీమతి రవీనా తుమ్మల, శ్రీమతి సౌమ్య మడకసిర పాల్గొని తమ సూచనలు, ప్రోత్సాహంతో పోటీలకు మరింత మెరుగులు దిద్దారు.


యూత్ కమిటీ సభ్యులు — యుక్త బుంగటావుల, ఆదిత్య అనంతుని, అద్వైత్ బొందుగుల, తనిష్క కర్రోతు, స్థుతి రాకోతు, పార్ధ కర్రోతు, క్రీషిత నందమూరి, విద్యా రెడ్డి కర్ర, ఆర్యన్ పసుపుల — కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ రోజంతా ఎంసీలుగా వ్యవహరించారు. వీరికి శ్రీమతి కవిత కురుకుండా, కృష్ణ నందమూరి మార్గదర్శకత్వం అందించారు.ఈ సందర్భంగా సంఘం తరఫున ఫోటోగ్రఫీ సేవలు అందించిన విశ్వనాథ్ కొగంటికి, ధ్వని–దృశ్య (AV) సేవలు అందించిన రమణ రాకోతుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలంకరణల సమన్వయానికి ఆదీ గుప్తా, వేదికను అందించిన భారతీయ టెంపుల్ కమిటీకి సంఘం ధన్యవాదాలు తెలిపింది.


ఈ విజయానికి అధ్యక్షుడు తులసి రామమోహన్ రావు తల్లూరి, ఉపాధ్యక్షుడు హరీష్ అన్నబత్తిన, కార్యదర్శి సురేష్ బొందుగుల, ట్రెజరర్ మధు బుడాటి, సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ చుండూరి, జాయింట్ ట్రెజరర్ శివ అనంతుని, సభ్యులు కవిత కురుకుండా, సునీత సిద్ధపురెడ్డి, కృష్ణ నందమూరి, విక్రమ్ అర్జుల, సురేష్ యలమర్తి, లవ కుమార్ ఐనంపూడి , భాస్కర్ మక్కెన, గౌరి కర్రోతు తదితరుల కృషి కీలకమైంది. ఈ సందర్భంగా May 2న Downing town High School East, 50 Devon Dr, Exton, PA లో జరగనున్న ఉగాది ఉత్సవాలకు అందరూ హాజరై విజయవంతం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.
















