Skip to main content

Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ .. రిపబ్లికన్లు గెలిస్తే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన హామీ ఇచ్చారు. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధుల సభ, సెనేట్‌ పై పట్టు నిలబెట్టుకుంటే, ప్రతి వయోజన అమెరికన్‌కు 5,000 డాలర్లు (సుమారు రూ.4 లక్షలు) ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ట్రంప్‌ డివిడెండ్‌ గా పిలుస్తామని చెప్పారు.డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్‌ పార్టీ సమావేశంలో ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేయకపోయినా తనను బ్యాలెట్‌పై ఉన్నట్టుగా భావించి పార్టీకి ఓటేయాలని మద్దతుదారులను కోరారు. రిపబ్లికన్లు గెలిస్తే, మీరూ గెలిచినట్లే. మీకు 5,000 డాలర్లు వస్తాయి అని చెప్పారు.

ఈ పథకానికి కనీసం 1 ట్రిలియన్‌ డాలర్లు అవసరమయ్యే అవకాశం ఉంది. ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడ నుంచి సమకూరుస్తారన్నది ట్రంప్‌ స్పష్టం చేయలేదు. మన దేశం చాలా డబ్బు సంపాదిస్తోంది అని చెప్పారు. ఆర్థికంగా, రాజకీయంగా ఈ ప్రతిపాదన అమలు చేయడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events