Skip to main content

Namaste NRI

కేసీఆర్‌పై  ఈసీ నిషేధం.. ఒక రాజకీయ కుట్ర : గుర్రాల నాగరాజు ఆరోపణ

బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పోరుబాట తో బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు వణికిపోతున్నారని బీఆర్‌ఎస్‌ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై  ఈసీ  నిషేధం ఒక రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలు, కేసీఆర్‌కు అంతటా నీరా జనం పడుతూ తమ గోడు వెల్లబోసుకుంటున్నారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

Social Share Spread Message

Latest News