Skip to main content

Namaste NRI

అమెరికాలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ఎన్నికల ప్రచారం

అమెరికాలోని మిషిగన్‌ రాష్ట్రంలో డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నోవై నగర కార్పొరేషన్‌ ఎన్నికల్లో కృష్ణా జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు పెద్దిబోయిన జోగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నోవై ప్రస్తుత, మాజీ మేయర్లతో ప్రచారం నిర్వహించిన యార్లగడ్డ జోగేశ్వరరావుకు తన మద్దతు తెలిపారు.  ఈ సందర్భంగా జోగేశ్వరరావు ఎన్నికల ఖర్చుల నిమిత్తం యార్లగడ్డ కుటుంబీకులు 3375 డాలర్లు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జోగేశ్వరరావుకు నోవైలో భారతీయులతో సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారని అన్నారు.

అమెరికా రాజకీయాల్లో ప్రవాసాంధ్రులు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. అమెరికా పౌరసత్వం కలిగిన ప్రవాస భారతీయులు మాతృదేశ రాజకీయాల్లో తామరాకుపై నీటి బిందువుల్లా వ్యవహరించాలని సూచించారు. స్థానిక రాజకీయాల్లో, సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని కోరారు. తాను ఏ దేశానికి వెళ్లినా ఇలాగే ప్రవాసులను ప్రోత్సహిస్తానని తెలిపారు.

Social Share Spread Message

Latest News