అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో బలమైన సామాజికాంశాలను చర్చిస్తూ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. మురళీకృష్ణ అబ్బూరు దర్శకుడు. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుడుతూ ఎట్టా ఎట్టా.. అనే తొలి గీతాన్ని విడుదల చేశారు. తమన్ స్వరపరచిన ఈ పాటను భాస్కరభట్ల రచించారు. సింగర్ శ్రీకృష్ణతో కలిసి తమన్ ఈ గీతాన్ని ఆలపించారు.

మాస్ మెలోడీగా సాగిన ఈ పాటలో నాయకానాయికలు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.జూన్ 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో, సంగీతం: తమన్, దర్శకత్వం: మురళీ కిశోర్ అబ్బూరు.















