Namaste NRI

అండమాన్‌లో ముగించి.. ఊటీ తీరానికి!

సూర్య హీరోగా,  స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం సూర్య 44. ఈ  చిత్ర తొలి షెడ్యూల్‌ కొన్నాళ్ల క్రితమే అండమాన్‌ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడిది ముగింపు దశకు చేరుకుంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే  అందమైన ప్రదేశంలో సూర్య, పూజాహెగ్డేపై వచ్చే రెండు పాటలను చిత్రీకరించినట్టు సమాచారం. ప్రస్తుత షెడ్యూల్‌ జులై మొదటి వారానికి పూర్తవుతుందని ఇన్‌సైడ్‌ టాక్‌. అనంతరం సూర్య అండ్ టీం నెక్ట్స్‌ షెడ్యూల్‌లో భాగంగా ఊటీకి వెళ్లనుందట.

ఈ చిత్రంలో బాలీవుడ్ భామ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా,  పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్‌ మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నాడు. తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్‌ ఈ చిత్రానికి డీవోపీగా పనిచేస్తుండటంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపో తుంది. సూర్య 44 పీరియాడిక్‌ వార్‌ అండ్ లవ్‌ నేపథ్యంలో సాగనుందని ఇప్పటివరకున్న టాక్‌. సూర్య హోం బ్యానర్ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రాన్ని 2025 పొంగళ్‌ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress