Skip to main content

Namaste NRI

గోపీచంద్‌ భీమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్

గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భీమా. ఏ. హర్ష దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ప్రియాభవానీ శంకర్‌, మాళవిక శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా లోని ఏదో ఏదో మాయ అంటూ సాగే తొలి గీతాన్ని విడుదల చేశారు. రవి బస్రూర్‌ స్వరపరచిన ఈ పాటకు కల్యాణ్‌ చక్రవర్తి సాహిత్యాన్నందించారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ప్రేమించిన అమ్మాయి పట్ల కథానాయకుడి ఆరాధనను ఆవిష్కరిస్తూ చక్కటి భావాలతో ఈ పాట సాగింది. నాయకానాయికలు గోపీచంద్‌, మాళవిక మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: స్వామి జె గౌడ, సంగీతం: రవి బస్రూర్‌, సంభాషణలు: అజ్జూ మహంకాళి, దర్శకత్వం: ఏ.హర్ష.

Social Share Spread Message

Latest News