Skip to main content

Namaste NRI

ఆస్ట్రేలియాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో ఎప్పింగ్ కమ్యూనిటీ హాల్‌లో దిల్ సే స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో మొదటి సారిగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మేల తాళాలతో వినాయకుణ్ణి భక్తుల సమక్షంలో ఊరేగించి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, నృత్యాలు, పాటల కార్యక్రమాలతో సందడిగా నిర్వహించారు. అశేషంగా హాజరైన భక్తుల సమక్షంలో వినాయకుణ్ణి నిమజ్జనం చేశారు. గణేష్ లడ్డు కోసం వేలం నిర్వహించగా  జ్యూస్ క్రీం అండ్ కో  ఫుట్ స్క్రే సంస్థ 15 వేల 116 డాలర్ల భారీ ధరకు సొంతం చేసుకోవడం విశేషం. 

భారతీయ సంస్కృతిని ఎన్నారైలు మరవకుండా విదేశాల్లో కూడా  ఇటువంటి గొప్ప సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించిన దిల్ సే సంస్థ అధ్యక్షుడు హర్ష రెడ్డి, నిర్వాహకులు సాయి కిరణ్ అభినందించారు.  ఈ కార్యక్రమంలో నిఖిల్, దరణేశ్, శ్రవణ్, బంటీ, శ్రీకర్, నవీన్, ఉమా పతి, సాగర్, శరత్, మోహన్, ప్రజ్జున్, శ్రీకాంత్, దత్తా, భవేశ్‌లను ప్రవాస సంఘాలు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News