Namaste NRI

ఆస‌క్తిక‌రంగా ఘప్ చుప్ గణేశ ట్రైల‌ర్

టాలీవుడ్ యువ న‌టులు రోహన్, రిదా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ఘప్ చుప్ గణేశ. ఈ సినిమాకు సూరి.ఎస్ ద‌ర్శ‌క‌త్వం. కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యాన‌ర్‌పై కేఎస్ హేమరాజ్ నిర్మిస్తున్నాడు. అశోక్ వర్ధన్, సోనాలి పానిగ్రాహి, కిశోర్ మారెశెట్టి, అంబాటి శ్రీనివాస్, జబర్దస్త్ గద్దం నవీన్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కార్పొరేట్ ల‌వ్ – కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్.

ఈ ట్రైల‌ర్ చూస్తుంటే  ఉద్యోగం వెతుక్కుంటూ పల్లెటూరి నుంచి నగరానికి వచ్చిన ఓ యువకుడి కథ ఇది. కష్టపడి ఉద్యోగం సంపాదించిన తర్వాత, అదే ఆఫీసులో హెచ్ఆర్‌గా పనిచేస్తున్న అమ్మాయిని అతను ప్రేమిస్తాడు. వారి ప్రేమకథలో ఎదురైన సంఘటనలు, ఊహించని మలుపులతో సినిమా ఆసక్తికరంగా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Social Share Spread Message

Latest News