అంజలి కథానాయికగా నటించిన తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. శివ తుర్లపాటి దర్శకత్వం. కోన వెంకట్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సిధ్ధు జొన్నలగడ్డ, విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలుగమ్మాయి అంజలి 50 చిత్రాల మైలు రాయికి చేరుకోవడం గొప్ప విషయమని, ఆమె మంచి పేరుప్రతిష్టలు పొందాలని ఆకాంక్షించారు. గీతాంజలి చిత్రాన్ని చిన్న కాన్సెప్ట్‌తో తీశాం. చాలా పెద్ద హిట్ అయింది. సీక్వెల్ కూడా అదేస్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుం దన్న నమ్మకం ఉంది అని నిర్మాత కోన వెంకట్ తెలిపారు. తన కెరీర్‌లో యాభయ్యవ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలని అంజలి కోరింది. ఈ సినిమాలోని ఇంటర్వెల్, క్లైమాక్స్ లో ఘట్టాలను మాత్రం అస్సలు మిస్ కావొద్దని, ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం, సస్పెన్స్‌ను పంచే సినిమా ఇదని దర్శకుడు శివ తుర్లపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.