Namaste NRI

ఎన్నారైలకు గుడ్ న్యూస్… ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే

ఎన్నారైలకు  గుడ్‌ న్యూస్‌. భారత్‌లోని తమ కుటుంబాలకు, స్నేహితులకు నగదు పంపించాలనుకుంటున్న వారికి పేటీఎం ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే నేరుగా తమ బంధువులు, స్నేహితుల పేటీఎం డిజిటల్‌ వాలెట్‌లోకి నిధులు ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు. ఇందుకోసం పేటీఎం రియా  మనీ ట్రాన్స్‌ఫర్‌ అనే నగదు బదిలీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రియా మనీకి ప్రపంచవ్యాప్తంగా 4,90,000 కేంద్రాలు ఉన్నాయి.  ఎన్నారైలు రియా మనీ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా తమ బంధువుల పేటీఎం వాలెట్‌లోకి నేరుగా డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేయచ్చు. నగదు బదిలీ రియల్‌ టైంలో అప్పటికప్పుడు జరుగుతుందని రియా మనీ పేర్కొంది. ఈ ప్రక్రియలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు అమలు చేస్తున్నామని తెలిపింది.

Social Share Spread Message

Latest News