Namaste NRI

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక ప్రకటన

వర్క్‌ఫ్రం హోం గూగుల్‌ కీలక ప్రకటన  చేసింది. వర్క్‌ ఫ్రం హోం మొదలై ఏడాది గడిచిపోవడంతో  గూగుల్‌ సైతం సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పని చేయాలని కోరింది. ఆ తర్వాత ఈ గడువును అక్టోబరుకు పొడిగించింది. కరోనా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోన్నా కొత్త రకం మ్యూటెంట్లతో ఎప్పటికప్పుడు ప్రమాదం ముంచుకొస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికాతో పాటు అనేక దేశాల్లో డెల్టా వేరియంట్‌తో వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. దీంతో  ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనే విషయంలో గూగుల్‌ వెనక్కి తగ్గింది.

                2022 జనవరి తర్వాత వరకు వర్క్‌ఫ్రం కొనసాగించాలని నిర్ణయించింది. ఆఫీసులకు వచ్చి పని చేయాలనే నిబంధను ఐచ్చికంగా మార్చింది. ఈ మేరకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కంపెనీ ఉద్యోగులకు ఈ మెయిల్‌ పంపారు.  2022 జనవరి 10 తర్వాత వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ వర్క్‌ ఫ్రం హోం కొనసాగించాలా? ఆఫీసులకు వచ్చి పని చేయాలా? అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటాం అని మెయిల్‌లో ఆయన పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News