Skip to main content

Namaste NRI

మే 7న  సర్కారు వారి పాట ప్రీ రిలీజ్‌ ఈవెంటే

మహేష్‌బాబు, కీర్తిసురేష్‌ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్‌ దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను 7వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. యూసుఫ్‌ గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో  జరుపనున్నట్లు మేకర్స్‌ వెల్లడిరచారు. ఈ వేడుకకి స్టార్‌ డైరెక్టర్‌ పూరీ రానున్నట్లు తెలిసింది.  అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా సర్కారు వారి పాట ఎమోజీతో అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. కొద్ది రోజులుగా దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న మహేష్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయన వరుసగా ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిసింది. బ్యాంకింగ్‌ స్కామ్‌ల నేపథ్యంలో తెరకెక్కినీ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి.  ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ రెట్టింపు అంచనాలను నమోదు చేసింది.  ఈ నెల 12న విడుదలువుతున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రాన్ని మైత్రీ  మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ సంస్థలతో కలిసి మహేష్‌బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events