Skip to main content

Namaste NRI

పూజా కార్యక్రమాలతో జిపిఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) చిత్రం ప్రారంభం

పవన్‌శంకర్‌, యాని, హెబ్బాపటేల్‌, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న జీపీఎల్‌ (గాడ్స్‌ ప్రీమియర్‌ లీగ్‌) చిత్రం ప్రారంభమైంది. జీఎం నాయుడు దర్శకత్వం. ఈ చిత్రాన్ని అల్లు సాయి లక్ష్మణ్‌ నిర్మిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఈ నెల 14 నుంచి మొదటి షెడ్యూల్‌ ప్రారంభిస్తామని దర్శకుడు తెలిపారు. భగవంతుడి ఆదేశాల మేరకే మన జీవితాలు నడుస్తాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ కంద, సంగీతం: మణిశర్మ, దర్శకత్వం: జీఎం నాయుడు.

Social Share Spread Message

Latest News