Skip to main content

Namaste NRI

సీఎం రేవంత్ రెడ్డితో గల్ఫ్ జెఏసీ బృందం  భేటీ

గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల (ఎన్నారై)  కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు లను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి (గల్ఫ్ జెఏసి) బృందం కృతజ్ఞతలు తెలిపింది. గల్ఫ్ హామీల అమలుకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే శ్రీకారం చుట్టడం అభినందనీయమని ఎన్నారైలు అన్నారు. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డా. బీఎం వినోద్ కుమార్, గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, ఖతర్ ఎన్నారై దాసరిపల్లి మిథిల, టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ వలసల విశ్లేషకులు మంద భీంరెడ్డి  సీఎం రేవంత్ రెడ్డి  కలిసారు. 

ఈ సందర్భంగా డా. బీఎం వినోద్ కుమార్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి మానవత్వం తో వ్యవహరిస్తున్నారని అన్నారు. సమగ్ర ఎన్నారై పాలసీ, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబ డి ఉన్నదని అన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 15 తర్వాత గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సీఎం ఎ. రేవంత్ రెడ్డి సమావేశం అవుతారని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ నెలాఖరుకు గల్ఫ్ దేశాలలో పర్యటిస్తారని ఆయన అన్నారు. 

Social Share Spread Message

Latest News