Skip to main content

Namaste NRI

శరవేగంగా గుంటూరు కారం షూటింగ్‌.. హైదరాబాద్‌లో యాక్షన్‌ సీన్స్‌

హీరో మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.  మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌, గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది.  ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన భారీ యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ ఎపిసోడ్‌ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అందరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా విషయంలో దర్శకుడు త్రివిక్రమ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News