జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వం. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. దేవర రిలీజ్ కు మరో నెల రోజులే ఉందని గుర్తు చేస్తూ ఓ అదిరిపోయే స్పెషల్ పోస్టర్ వదిలారు. అందులో తారక్ కొంచెం నవ్వు.. మరికొంచెం రౌద్రరూపంలో ఉన్నట్లు రెండు డిఫెరెంట్ షేడ్స్ చూపించారు. దానికి ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ అనే క్యాప్చన్ జోడించారు. అంతేకాకుండా ఒక నెలలో బిగ్ స్క్రీన్ పైకి దేవర రాక, ఆ అనుభూతి ప్రపంచాన్ని కదిలిస్తుంది.
వివక్షకు, అణచివేతకు గురవుతున్న తనవారికి అండగా నిలబడి, ధర్మసంస్థాపన చేసిన ఓ ధీరోదాత్తుని కథగా దేవరను కొరటాల శివ రూపొందిస్తున్నారు. తీరప్రాంత నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకె క్కుతున్న ఈ చిత్రం తొలి భాగం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. వచ్చే నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుథ్, నిర్మాతలు: సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్.