Skip to main content

Namaste NRI

హాయ్ నాన్నా సెకండ్ సింగిల్ గాజుబొమ్మ

నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హాయ్‌ నాన్న. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక.  శౌర్యువ్‌ దర్శకుడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ సినిమాలో  గాజు బొమ్మ అనే రెండో గీతాన్ని అగ్ర హీరో మహేష్‌బాబు విడుదల చేశారు. నన్ను కదిలించినట్లే ప్రతీ తండ్రిని హత్తుకునే పాట ఇది. హాయ్‌ నాన్న టీమ్‌కు నా శుభాకాంక్షలు అని మహేష్‌బాబు పేర్కొన్నారు. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ స్వరపరచిన ఈ గీతానికి అనంత్‌శ్రీరామ్‌ సాహిత్యాన్ని అందించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సానుజాన్‌ వర్గీస్‌, సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా, దర్శకత్వం: శౌర్యువ్‌. డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events