Skip to main content

Namaste NRI

వాషింగ్టన్‌ లో హిందువులు భారీ ర్యాలీ

అయోధ్య రామాలయం నెలరోజుల్లో ప్రారంభం కానుంది. వచ్చేఏడాది జనవరి 22న అద్భుతంగా కళాఖండగా తీర్చిదిద్దిన ఆలయంలో రాములవారికి ప్రాణప్రతిష్ఠ  చేయనున్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీ మేరీలాండ్‌ లో ఉన్న భక్త ఆంజనేయ ఆలయం వద్ద అమెరికన్‌ హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో పదేండ్ల చిన్నారుల నుంచి 70 ఏండ్ల వయస్సున్న పెద్దల వరకు పెద్దసంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. అయోధ్య వేగా నామకరణం చేసిన రోడ్డులో చేతుల్లో కాషాయ జెండాలు పట్టుకుని కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా అమెరికా డీసీ చాప్టర్‌ విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు మహేంద్ర సాపా మాట్లాడుతూ రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ తీశామన్నారు. రామ మందిర నిర్మాణం కోసం 500 ఏండ్లుగా పోరాడుతున్న హిందువుల కల త్వరలో నెరవేరబోతున్నది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్‌ డీలో జనవరి 20ను తాము కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రామ్‌ లీలా, శ్రీరాముని చరిత్ర, రామ భజనల వంటివి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి అమెరికన్‌ హిందూ కుటుంబాలు పాల్గొంటున్నాయని తెలిపారు. చిన్నారులతో 45 నిమిషాల పాటు శ్రీరాముని జీవిత చరిత్రను చెప్పించబోతున్నామని వెల్లడించారు.

Social Share Spread Message

Latest News