
2025 ఏడాదికి గానూ ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. తాజాగా సాహిత్యంలో నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. హంగేరియన్ రచయిత క్రాస్జ్నా హోర్కై ను ఈ ఏడాది సాహిత్య నోబెల్ వరించింది. లిటరేచర్‌లో గతేడాది దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న విషయం తెలిసిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్ నెబెల్ మరణించగా, 1901 నుంచి ఆయన జ్ఞపకార్థం ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.
















