
న్యూయార్క్ ఫ్యాషన్ ఈవెంట్ మెట్‌గాలాలో హైదరాబాదీ బిలియనీర్ సుధారెడ్డి మెరిసిపోయారు. సుమారు 142 కోట్ల ఖరీదైన నెక్లెస్‌ను ఆమె ఆ షో కోసం ధరించారు. ఆ నెక్లెస్ ఆమె ప్రైవేట్ కలెక్షన్‌కు చెందినట్లు తెలుస్తోంది. స్టయిలిస్టు మారియల్ హెనిన్ దీన్ని డిజైన్ చేశారు. విక్టోరియన్ ఫినిష్ చెయిన్ స్టయిల్‌లో దీన్ని రూపొందించారు. ఈ నెక్లెస్‌లో ఖరీదైన త్రికోణ రోజ్‌కట్ వజ్రాలు ఉన్నాయి. పువ్వుల అల్లిక తరహాలో ఆ జెమ్స్ సుందరంగా కనిపిస్తున్నాయి. ఇక నెక్లెస్ మధ్య భాగంలో ఖరీదైన 550 క్యారెట్ల డీప్ వాయోలెట్, బ్లూ టాంజానియా డైమెండ్ ఉన్నది. ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆ పెండెంట్.. టాంజానియాలోని మెరిలాని హిల్స్ ప్రాంతానికి చెందినట్లు తెలుస్తోంది. పెద్ద సైజులో కనిపిస్తున్న ఆ పెండెంట్‌ను, క్వీన్ ఆఫ్ మెరిలానీ అని పిలుస్తారు.





























