Skip to main content

Namaste NRI

హే చికీతా చిత్రంతో అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను: చదలవాడ శ్రీనివాసరావు

పవన్‌ కల్యాణ్‌ మ్యానరిజంను స్పూర్తిగా తీసుకొని డైరెక్టర్ ధన్‌రాజ్‌ లెక్కల తెరకెక్కిస్తున్న చిత్రం హే చికీతా. అభినవ్‌ మణికంఠ, దివిజ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రభాకర్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సుందరకాండ మోషన్‌ పిక్చర్స్‌, ఎల్‌ఎల్‌పీ బ్యానర్లపై అంజి, ఎన్‌ అశోక్‌ ఆర్‌ఎన్‌ఎస్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో తన్మయి కుషి, దేవీ ప్రసాద్‌, బలగం సుజాత, అంజిమామ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ నేను యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు లైలా మూవీని చేశాను. ఆడియో రైట్స్‌తోనే ఎంతో లాభం వచ్చింది. హే చికీతా టీంని చూస్తే నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే గానీ నిర్మాతగానో, ఆర్టిస్టుగానో, టెక్నీషియన్ గానో ఇండస్ట్రీలోకి రాలేం. హే చికీతా విషయంలో ఆర్టిస్టులు అంతా బాగా నటించారు. అంజి కెమెరా వర్క్ బాగుంది. దర్శకుడు, నిర్మాత ఇలా అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాతో హిట్ కొడితే వచ్చే సంతృప్తి అంతా ఇంతా కాదు. ఇలాంటి చిత్రాలకు మీడియా అండగా నిలబడాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

అలీ మాట్లాడుతూ బద్రి సినిమాలో హే చికీతా పాట ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో ఈ మూవీ కూడా అంతే హిట్టవ్వాలని కోరుకుంటున్నానన్నాడు. ఓ సినిమాను తీయడం, విడుదల చేయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలో విషయముంటే ప్రేక్షక దేవుళ్లు నెత్తిన పెట్టుకుని చూస్తారు. భవిష్యత్‌లో రైతు అనేవాడు ఉంటాడా? కనిపిస్తాడా? అనిపిస్తుంది. రైతు ఉంటేనే దేశం నిలబడుతుంది. రైతు మీద, యూత్‌ మీద తీసిన ఈ సినిమా మంచి హిట్టవ్వాలని అలీ ఆకాంక్షించాడు.

ఇది నా మొదటి సినిమా. రైతులు, యువత కోసం ఈ సినిమా చేశాను. సినిమాలో అంజి మామ, అజయ్‌పాత్రలు అందరినీ నవ్విస్తాయని డైరెక్టర్ ధన్‌రాజ్‌ లెక్కల అన్నాడు. రామ్‌ లక్ష్మణ్ మాస్టర్స్‌ మాట్లాడుతూ పల్లెటూరులో చాలా ప్రేమకథలుంటాయి. ఈ మూవీ పోస్టర్‌ను చూస్తుంటూ మా ఊరిలో ఉన్న రోజులు గుర్తుకొచ్చాయనిరు. రైతుపంట పండిస్తేనే మనం ఇలా జీవిస్తున్నాం. రైతే రాజు అనే కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ చిత్రాన్ని జులై 24న విడుదల చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News