Skip to main content

Namaste NRI

ప్రేమను పంచడం గురించే ఆలోచిస్తా : విజయ్‌ దేవరకొండ

అగ్ర కథానాయకుడు విజయ్‌ దేవరకొండ తాజా చిత్రం కింగ్‌డమ్.  నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్‌ దేవరకొండ మాట్లాడారు. యుద్ధంలోకి దిగామంటే అన్నింటికి సిద్ధంగా ఉండాలి. అందుకే నేనెప్పుడూ ఫిట్‌గా ఉంటూ నటుడిగా ఏ సవాలునైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటా. ప్రతీ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేస్తా అన్నారు.

గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా కూల్‌గా మాట్లాడుతున్నారనే ప్రశ్నకు విజయ్‌ దేవరకొండ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తాను ఎవరి కోసమో మారనని, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని చెప్పారు. సోషల్‌మీడియాలో కొందరు ఆయనపై చేసే వ్యతిరేక ప్రచారం గురించి స్పందించాలని కోరగా నేను కేవలం ప్రేమను పంచడం గురించే ఆలోచిస్తా. ద్వేషం మీద దృష్టిపెట్టేంత తీరిక లేదు అన్నారు. కింగ్‌డమ్ సినిమాలో యాక్షన్‌ అన్నది కేవలం ఓ ఎలిమెంట్‌ మాత్రమేనని, కథ మొత్తం కట్టిపడేసే భావోద్వేగాలతో సాగుతుందని తెలిపారు. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు కింగ్‌డమ్ ప్రపంచంలో లీనమైపోతారని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, సమర్పణ: శ్రీకర స్టూడియోస్‌, దర్శకత్వం: గౌతమ్‌ తిన్ననూరి.

Social Share Spread Message

Latest News