Namaste NRI

ఈ సినిమాని పవన్‌ కల్యాణ్‌ చూడాలని కోరుకుంటున్నా: అల్లు అరవింద్‌

అశ్విన్‌కుమార్‌ దర్శకత్వంలో క్లీమ్‌ ప్రొడక్షన్స్‌, హోంబాలే ఫిల్మ్స్‌ పతాకాలపై శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశాయ్‌, చైతన్య దేశాయ్‌ నిర్మించిన ప్రతిష్టాత్మక వెంచర్‌ మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌. శ్రీమహావిష్ణువు దశావతారాలకు చెందిన శ్రీమద్‌భాగవతం ఈ యానిమేటెడ్‌ ఫ్రాంచైజీ ద్వారా దృశ్యమానం కానున్నది. ఇందులో తొలి భాగంగా గత నెల 25న విడుదలైన మహావతార్‌ నరసింహ ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని అందుకున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో తెలుగులో ఈ సినిమాను విడుదల చేసిన నిర్మాత అల్లు అరవింద్‌  మాట్లాడారు.  నాలుగేళ్ల క్రితం ఈ సినిమాను మొదలుపెట్టి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, పట్టుదలతో మేకర్స్‌ మనముందుకు తెచ్చారు. నరసింహస్వామి కటాక్షం వల్లే ఇది సాధ్యమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ సినిమాకు జేజేలు పలుకుతున్నారు. ఎప్పుడూ థియేటర్లకు రాని ప్రేక్షకులు సైతం ఈ సినిమాను వీక్షిస్తున్నారు. హైదరాబాద్‌ ఏఎంబీలో 200మంది స్వాములు ఈ సినిమా చూడటం ఆనందాన్నిచ్చింది. మా కుటుంబంలో సనాతనధర్మం గురించి పవన్‌కల్యాణ్‌కి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. ఈ సినిమా చూసి, దీని గురించి ఆయన మాట్లాడాలని ఆశిస్తున్నా  అని అన్నారు.

దీన్ని సినిమాగా కాకుండా, ఓ మహాదర్శనంగా ప్రేక్షకులు భావిస్తున్నారని, ఈ ప్రశంసలన్నీ నరసింహస్వామికే చెందుతాయని, మాతో పాటు అందరికీ డివైన్‌ ఫీలింగ్‌ కలిగించిన సినిమా ఇదని, ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన గీతా ఆర్ట్స్‌ వారికి కృతజ్ఞతలని దర్శకుడు అశ్విన్‌కుమార్‌ అన్నారు. ఇంకా నిర్మాత శిల్పా ధావన్‌, తనికెళ్ల భరణి, రచయిత జొన్నవిత్తుల కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News