ఢిల్లీ లిక్కర్ పాలసీ పేరుతో తమ పార్టీ ఎమ్మెల్సీ కవితపై ఈడీ అక్రమంగా కేసు బనాయించి 165 రోజులు అన్యాయంగా జైల్లో వేయించడం తీవ్ర బాధాకరమని ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ పాలసీలో ఆమెకు ఎలాంటి ప్రమేయం లేదని, ఇందుకు సంబంధించి ఆమె వద్ద నుంచి ఎలాంటి పత్రాలు, ఆధారాలు లభించలేదని ఆయన చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అసలు దమ్ము లేదని, అన్యాయంగా, అక్రమంగా బనాయించారని మహేశ్ బిగాల ఆరోపించారు. రాజకీయ ప్రేరేపిత కేసులో చివరకు న్యాయమే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.