Skip to main content

Namaste NRI

భారత రాయబారి కీలక ప్రకటన…కువైత్ లోని

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కువైత్‌తోని భారత రాయబారి సిబి జార్జ్‌ కీలక ప్రకటన చేశారు. కరోనా వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ఇండిపెండెంట్స్‌ డే సందర్భంగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు వెల్లడిరచారు. ఈ ప్రక్రియను పరిశీలించడానికి ఇప్పటికే ఏర్పాటు చేసిన ముగ్గురు అధికారులతో కూడిన టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ మొదటి విడతో భాగంగా 65 కుటుంబాలకు ఎంపిక చేసినట్టు చెప్పారు. కుటుంబానికి రూ.లక్ష పెద్ద మొత్తం కానప్పటికీ, దీని ద్వారా వారికి కొంత ఉపశమనం కలుగుతుందని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. 120 కువైటీ దినార్ల కంటే తక్కువ వేతనం కలిగి ఉండి కువైత్‌లో కొవిడ్‌తో మృతి చెందిన వారిక కుటుంబాలను టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఎంపిక చేసినట్టు వివరించారు.

Social Share Spread Message

Latest News