Skip to main content

Namaste NRI

అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి .. కథ విషాదాంతం

అమెరికాలో గత ఆదివారం అదృశ్యమైన భారతీయ విద్యార్థి నీల్‌ ఆచార్య కథ విషాదాంతమైంది. నీల్‌ మృతదేహాన్ని అతడు చదువుతున్న యూనివర్సిటీ క్యాంపస్‌లోనే పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్‌ క్లిఫ్టన్‌ ధ్రువీకరించారు. నీల్‌ ఆచార్య  ఇండియానా రాష్ట్రం లోని పర్డ్యూ విశ్వవిద్యాలయం లో చదువుతున్నాడు. అయితే, ఆదివారం యూనివర్సిటీ క్యాంపస్ నుంచి అతడు అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని అతడి తల్లి ఆదివారం నుంచి తన కొడుకు కనిపించడం లేదని, అతడిని గుర్తించడంలో సాయం చేయండంటూ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. చివరిసారిగా ఉబర్‌ డ్రైవర్‌ నీల్‌ను క్యాంపస్‌లో వదిలిపెట్టినట్లు తెలిపారు. ఈ పోస్ట్‌పై స్పందించిన షికాగోలోని భారత రాయబార కార్యాలయం వర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అ మేరకు విద్యార్థిని గుర్తించడంలో అవసరమైన సహాయ సహకారాల్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా నీల్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Social Share Spread Message

Latest News