అమెరికాలో శాశ్వత నివాస హక్కును కల్పించే గ్రీన్ కార్డు కోసం అక్కడి భారతీయ వృత్తి నిపుణులు దశాబ్దా లుగా ఎదురుచూస్తున్నారు. గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్స్‌లో భారతీయుల సంఖ్య 2023 నవంబర్ 2 నాటికి 12,59,443కు చేరుకున్నది. అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) డాటాను విశ్లేషించిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్‌ఎఫ్‌ఏపీ) తాజా గణాంకాల్ని విడుదల చేసింది. డాక్టర్లుగా, సైంటిస్టులుగా, కాలేజీ ప్రొఫెసర్లుగా, మల్టీనేషనల్ కంపెనీ సీఈవోలుగా, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు సైతం గ్రీన్ కార్డు పొంద లేక అవస్థ పడుతున్నారు.ఇది వ్యక్తిగతంగా వారిపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అమెరి కా చట్టసభ కాంగ్రెస్ సరైన చర్య తీసుకోకపోతే, గ్రీన్ కార్డు కోసం నిరీక్షించే భారతీయ వృత్తి నిపుణుల సంఖ్య 2030నాటికి 21,95,795కు చేరుకుంటుందని అంచనా.