Skip to main content

Namaste NRI

ప్రపంచ వ్యాప్తంగా దీక్షా దివస్ : మహేష్ బిగాల

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్‌, 2009న కేసీఆర్‌ అమరణ నిరాహార దీక్షా చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్‌ తెలంగాణ గతిని మార్చేసింది. తెలంగాణ సమాజం యావతు కేసీఆర్‌ వెంట నిలవడంతో కేంద్రం మెడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ సందర్భంగా అమెరికాలోని అట్లాంటా, న్యూజెర్సీలో నవంబర్‌ 29న ప్రత్యక్షంగా దీక్షా దివస్‌లో పాల్గొననున్నట్టు మహేశ్‌ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా దీవస్‌ స్ఫూర్తిని, అమరుల త్యాగాలని, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తించి ప్రపంచ దేశాలలో దీక్షా దివస్‌ ని జరపాలని ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల పిలుపునిచ్చారు.

                అలాగే దీక్షా దివస్‌ సందర్భంగా తెలంగాణ అమరులకు, తెలంగాణ ఉద్యమ నేతలు స్వర్గీయులు ప్రొఫెసర్‌ జయ శంకర్‌ సర్‌, విద్య సాగర్‌, నాయిని నర్సింహా రెడ్డి, రామలింగ రెడ్డి, నోముల నర్సింహమ్య తదితరులకు నివాళులు అర్పించాలని కోరారు. అద్భుతమైన ప్రజా సంక్షేమ పథకాలతో ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకెళ్లాలని ఆకాంక్షంచారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉంటాయని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events