Namaste NRI

ఇది చరిత్రాత్మకం …. సముద్రంలో అతివల ఘనత 

భారత నౌకాదళానికి చెందిన అయిదుగురు మహిళా అధికారులు అరుదైన ఘనత సాధించారు. డోర్నియర్‌ 228 విమానంలో వీరు ఉత్తర అరేబియా సముద్రం మీదుగా మొదటి స్వతంత్ర సముద్ర నిఘా విషన్‌ను నిర్వహించారు. గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు చెందిన ఐఎస్‌ఏఎస్‌ 314 ఫ్రంట్‌లైన్‌ నేవల్‌ ఎయిర్‌ స్కాడ్రస్‌ నుంచి మహిళా అధికారులు సాధించిన ఈ ఘనత చారిత్రాత్మకం అని భారత నౌకదళం ప్రశంసించింది.  ఈ మిషన్‌కు లెఫ్టినెంట్‌ కమాండర్‌ ఆంచల్‌శర్మ నేతృత్వం వహంచారు. పైలెట్లు అయిన లెఫ్టినెంట్‌ శివాంగి, లెఫ్టినెంట్‌ అపూర్వ గీతేతో పాటు లెఫ్టినెంట్‌ పూజా పాండా, సబ్‌ లెఫ్టినెంట్‌ పూజ షెకావత్‌ ఈ బృందంలో మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ మిషన్‌ కోసం వీరికి కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చారు.  నారీశక్తి అంటే ఏమిటో చూపించిన ఈ మిషన్‌ వైమానిక దళంలో చేరేందుకు యువతులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కమాండర్‌ మధ్వాల్‌ వ్యాఖ్యానించారు. ఈ విషన్‌ సాయుధ దళాలు సాధించిన ఒక ప్రత్యేక విజయానికి సూచిక అని ఆయన అన్నారు. ఈ మిషన్‌ నారీ శక్తిలో నిజమైన స్ఫూర్తిని నింపుతుందని ఆయన పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News