Namaste NRI

జాక్ పాట్ కొట్టాడు.. కానీ అనుభవించకుండానే

అమెరికాలోని మిషిగాన్‌ రాష్ట్రానికి చెందిన గ్రెగరీ జార్విస్‌ లాటరీలో 47 వేల డాలర్లు గెలిచినా కూడా ఆ డబ్బును కళ్లచూడకుండానే మృతి చెందాడు. కేస్‌విల్‌ ప్రాంతానికి చెందిన జార్విస్‌ సెప్టెంబర్‌ 13న బ్లూవాటర్‌ ఇన్‌లో క్లబ్‌ కినో యాడ్‌ అన్‌ గేమ్‌ అడి జాక్‌పాట్‌ కొట్టాడు. ఏకంగా  47 వేల డాలర్లు గెలుచుకున్నాడు. అయితే ఈ మొత్తాన్ని తీసుకునేందుకు అతడి  వద్ద సోషల్‌ సెక్యూరిటీ నెంబర్‌ లేకపోవడంతో కొత్తదాని కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ రోజు అతడు ఆ ప్రాంతంలోని సరస్సు వద్దకు వెళ్లి ఆ తరువాత కనిపించకుండా పోయాడు.  స్మాల్‌ హురాన్‌ కౌంటీలో సీటీలోని ఓ వ్యక్తి అక్కడి ప్రైవేట్‌ బీచ్‌ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు మృతుడిని జార్వీస్‌గా గుర్తించారు. అతడి జేబులో లాటరీ టిక్కెటు కూడా కనిపించింది.  జార్విస్‌ నీటిలో మునిగిపోయి మృతి చెందినట్టు పోస్ట్‌మార్టు నివేదిక తేల్చింది. పడవను బీచ్‌లో నిలిపే క్రమంలో అతడు ప్రమాదవశాత్తూ నీళ్లల్లో పడి మరణించి ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Social Share Spread Message

Latest News