Skip to main content

Namaste NRI

పునీత్‌ జయంతిని సందర్భంగా వస్తున్న జేమ్స్‌

కన్నడ అగ్ర హీరో దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన చివరి చిత్రం జేమ్స్‌. ఈ చిత్రాన్ని పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 17న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను హీరో శ్రీకాంత్‌, విజయ్‌ ఎమ్‌ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కన్నడ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఈ సినిమాలో ఆర్మీ అధికారిగా శక్తివంతమైన పాత్రలో కనిపించారు. దేశం కోసం జేమ్స్‌ చేసిన పోరాటం స్ఫూర్తివంతంగా ఉంటుంది. యాక్షన్‌ ఘట్టాలు అబ్బురపరుస్తాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, లిరికల్‌ వీడియోకు మంచి స్పందన లభిస్తున్నది అని చిత్ర బృందం తెలిపింది. శివ రాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, హీరోయిన్‌గా ప్రియా ఆనంద్‌, శ్రీకాంత్‌, శరత్‌కుమార్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: స్వామి జె గౌడ, సంగీతం: చరణ్‌రాజ్‌, నిర్మాత: కిషోర్‌ పత్తికొండ. ప్రస్తుతం సినిమాకు సంబంధించి సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయని, హీరో శ్రీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో విడుదల చేస్తున్నామని విజయ్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events