
స్వీయ దర్శకత్వంలో సాయివెంకట్ నటిస్తున్న చిత్రం జయహో రామానుజ. జోశర్మ కథానాయిక. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మాతలు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం పాటల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయివెంకట్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ తెలుగు ప్రజలకు రామానుజాచార్యుల గొప్పతనాన్ని తెలియజెప్పాలని ఈ సినిమా చేశా. తిరుమల వెంకటేశ్వరుడికి శంఖు చక్రాలను రామానుజాచార్యుల వారే బహూకరించారు. ఈ సినిమాలో నేను 11 పాత్రల్ని పోషించాను. ఇదొక రికార్డుగా భావిస్తున్నా అన్నారు. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించామని నిర్మాత ప్రవళ్లిక తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: సుదర్శనం సాయిప్రసన్న, సుదర్శనం ప్రవల్లిక, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లయన్ సాయి వెంకట్.
