కంచి కామకోటిపీఠంలో జరుగుతున్న శ్రీవిద్యాయాగానికి హాజరు కావాలని పీఠం (ధర్మాధికారి) శ్రీకార్యం బ్రహ్మ శ్రీ చల్లా విశ్వనాథశాస్త్రి, పీఠం ఆస్థాన పండితుడు బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రమణ్యశాస్త్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కంచి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న సంప్రదాయ పాఠశాలల ఇతర కార్యకలాపాల కోసం హైదరాబాద్‌లో స్థలం ఇవ్వాలని వినతి చేశారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వారికి అనువైన చోట పీఠానికి స్థలం ఇస్తామని హామీఇచ్చారు.