Skip to main content

Namaste NRI

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. హరీష్రావు అదనపు బాధ్యతలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖను అదనంగా అప్పగించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో వైద్యారోగ్య శాఖ బాధ్యతలు చూసిన ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణలు రావడంతో ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వైద్యారోగ్య శాఖను సీఎం తన వద్దనే అట్టిపెట్టుకున్నారు. కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణంతో వైద్య రంగానికి కొత్తరూపునివ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖను హరీశ్రావుకు అదనపు బాధ్యతగా అప్పగించడం గమనార్హం.

Social Share Spread Message

Latest News