Namaste NRI

పెద్ది రిలీజ్‌పై కీలక అప్‌డేట్‌.. మరో ఆరు రోజుల్లో

అగ్ర హీరో రామ్‌చరణ్‌ నటిస్తున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్‌ ఇండియా స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా పెద్ది. జాన్వీ కపూర్‌ కథానాయిక. శివరాజ్‌కుమార్‌, జగపతిబాబు కీలక పాత్రధారులు. బుచ్చిబాబు సానా దర్శకుడు. వెంకటసతీశ్‌ కిలారు నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కావచ్చింది. మరో 6రోజుల్లో గుమ్మడికాయ కొట్టేయనున్నట్టు మేకర్స్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా సెట్స్‌ నుంచి విడుదలైన కొత్త స్టిల్స్‌ షూటింగ్‌ స్పాట్‌లోని పాజిటివ్‌ ఎనర్జీని సూచిస్తున్నాయి. ైస్టెలిష్‌ లుక్‌లో కనిపిస్తున్న రామ్‌చరణ్‌ని, ఆయనతో ఉన్న దర్శకుడు బుచ్చిబాబు సానాను ఈ పోస్టర్‌లో చూడొచ్చు. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

జూన్‌లో సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ తెలియజేశారు. దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.రత్నవేలు, సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌, సహనిర్మాత: ఇషాన్‌ సక్సేనా, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, నిర్మాణం: వృద్ధి సినిమాస్‌.

Social Share Spread Message

Latest News