ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలను విడనాడాలని, వేర్పాటు వాదులు లొంగిపోవాలని సూచించారు. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. జోక్యం చేసుకునేవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రారంభిస్తున్నామని తెలిపారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులను రక్షించడానికే ఇది చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదైనా రక్తపాతం జరిగే దానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పొరుగు దేశం నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిగా మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఉక్రెయిన్ ఆక్రమించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. రష్యా, ఉక్రెయిన్ విషయంలో ఎవరైనా తలదూర్చొదని, అలాకాకుండా ఎవరైనా జోక్యంచసుకుంటే తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.














