Skip to main content

Namaste NRI

మహిళలు క్లాప్స్‌ కొట్టేలా.. ఆడవాళ్ళు మీకు జోహార్లు

శర్వానంద్‌, రష్మిక జంటగా తిరుమల కిషోర్‌ తెరకెక్కించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.  ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. గురువారం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగినా సమావేశంలో రష్మికా మందన్నా మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా అందరూ చూసి ఎంజాయ్‌ చేయదగ్గ  సినిమా ఇది. మంచి ఫ్యామిలీ సినిమా చేశాం. అందరూ థియేటర్‌కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను అన్నారు. మంచి మనసు ఉన్న వ్యక్తి లభిస్తే పెళ్లి చేసుకుంటాను. ఇప్పటి వరకు ఎవరితోనూ నా పెళ్ళి ఫిక్స్‌ కాలేదు అన్నారు రష్మిక. ఈ నేపథ్యంలో దర్శకుడు తిరుమల కిషోర్‌ మాట్లాడుతూ మహమ్మారి తర్వాత కుటుంబం పిల్లలతో కలిసి చూసే సినిమాని మిస్సయ్యాం. ఆ లోటును మా చిత్రం పూడుస్తుందని నమ్ముతున్నాం. ఈ సినిమాతో థియేటర్లు ఫ్యామిలీలతో కళకళలాడాలని కోరుకుంటున్నా. ఈ చిత్రంలో మంచి ప్రేమకథ ఉంది. దీంట్లోని ప్రతి సీన్‌ను అందరూ ఎంజాయ్‌ చేస్తారు. ఇంటర్వెల్‌ సీన్‌కు మహిళలు చప్పట్లు కొడతారని గట్టిగా చెప్పగలను అన్నారు. కుటుంబంతో సినిమాకు రండి. థియేటర్‌ నుంచి నవ్వుకుంటూ బయటకు వెళ్తారన్నారు నిర్మాత. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, రాధిక, ఊర్వశీ, రaాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ కార్యక్రమంలో కిశోర్‌ తిరుమల, నిర్మాత సుధాకర్‌ చెరుకూరి, నటి రaాన్సీ, కెమెరామెన్‌ సుజిత్‌, హీరోయిన్‌ రష్మిక మందన్నా తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News