Skip to main content

Namaste NRI

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 454 మంది అంగీకారం తెలపగా, ఇద్దరు నో  అని ఓట్ చేసినట్లుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం స్లిప్పుల ద్వారా సభలో ఓటింగ్ నిర్వహించారు. అంతకుముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్ ప్రారంభం అయింది. డిజిటల్ ఓటింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య ఉండడంతో ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఆకుపచ్చ, ఎరుపు రంగు స్లిప్పులపై ఎస్, నో అని ఉంటాయని, దానిపై సభ్యుడు సంతకం చేసి, వారి పేరు, ఐడీ నెంబర్, నియోజకవర్గం, రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం పేరు, తేదీ వంటి వివరాలు రాయాలని లోక్ సభ సెక్రటరీ ఉత్పల్ కుమార్ సింగ్ ముందే సూచించారు. స్లిప్పులు పంపిణీ చేసిన తర్వాత నుంచి మళ్లీ సభ్యుల నుంచి తీసుకొనే వరకూ ఎవరూ తమ సీట్లు వదిలి వెళ్లవద్దని సూచించారు మొత్తం 454 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా.. ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు.

Social Share Spread Message

Latest News