Skip to main content

Namaste NRI

మాలాశ్రీ తనయ అరంగేట్రం

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మాలాశ్రీ. కథానాయికగా పలు విజయవంతమైన చిత్రాల్లో మెరిశారామె. ఇప్పుడు ఆమె కుమార్తె రాధనా రామ్‌ కెమెరా ముందుకొచ్చింది. తరుణ్‌ సుధీర దర్శకత్వంలో దర్శన్‌ కథానాయకుడిగా ఇటీవల బెంగళూరులో డి56 పేరుతో ఓ చిత్రం మొదలైంది. రాక్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాక్‌లైన్‌ వెంకటేశ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత రాము, రాధనా రామ్‌ కథానాయికగా పరిచయమవుతోంది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళం, హిందీ భాషల్లో  తెరకెక్కిస్తున్నారు.  ఈ సందర్భంగా మాలశ్రీ మాట్లాడుతూ రాధానాకు చిన్నప్పటి నుంచే నటన ఇష్టం. ముంబయిలో నటన, డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. నా కూతురు స్వయంకృషితో పరిశ్రమలో రాణించాలని కోరుకుంటున్నా అని చెప్పింది. రాధనా సినీ రంగ ప్రవేశంపై మాలాశ్రీ సంతోషం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events