Namaste NRI

కార్తీ సరసన మాళవిక మోహనన్‌

50e409c6 592a 4e9f 922f 2a94141522d8 7

మలయాళం, తమిళ భాషల్లో ప్రతిభావంతురాలైన కథానాయికగా పేరు తెచ్చుకుంది మాళవిక మోహనన్‌. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ప్రభాస్‌ సరసన రాజాసాబ్‌ చిత్రంలో నటిస్తున్నది. తాజాగా ఆమె తమిళంలో కార్తీ సరసన కథానాయికగా నటించే బంపరాఫర్‌ను దక్కించుకుంది. కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సర్దార్‌-2 ఇటీవలే ప్రారంభమైంది.  పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ చెన్నైలో జరుగుతున్నది. ఈ సినిమాలో మాళవిక మోహనన్‌ కథానాయికగా ఖరారైంది. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారి కంగా ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, కథాగమనంలో మాళవిక మోహనన్‌ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌ రాజా, నిర్మాత: ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌.

f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 7
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events