Skip to main content

Namaste NRI

డెవిల్‌ నుంచి మాళవికా నాయర్‌ ఫస్ట్‌లుక్‌

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్‌ స్పై థ్రిల్లర్‌ చిత్రం డెవిల్‌. సంయుక్త మీనన్‌ కథానాయిక. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ ఉపశీర్షిక. స్వీయ దర్శకనిర్మాణంలో అభిషేక్‌ నామా తెరకెక్కిస్తున్నారు. మాళవికా నాయర్‌ కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె ఫస్ట్‌లుక్‌  పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె రాజకీయ నాయకురాలు మణిమేఖల పాత్రలో కనిపించనుంది. రెట్రో లుక్‌తో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. కథాగమనంలో మణిమేఖల పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రలో హీరో కల్యాణ్‌రామ్‌ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్,  నెట్టింట వైరల్ హల్ చల్ చేస్తోంది. నవంబర్‌ 24న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్ర ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్‌ ఎన్‌, నిర్మాత, దర్శకత్వం: అభిషేక్‌ నామా.

Social Share Spread Message

Latest News